ముగిసిన మంత్రివర్గ సమావేశం

సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది.  పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుపై మంత్రివర్గం చర్చించింది. హైపవర్‌ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.

Updated : 20 Jan 2020 11:19 IST

అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది.  పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుపై మంత్రివర్గం చర్చించింది. హైపవర్‌ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.

మొత్తం ఏడు అంశాల అజెండాగా మంత్రివర్గ సమావేశం కొనసాగింది. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలివి..

హైవపర్‌ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం..

పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం

పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి బిల్లుకు ఆమోదం

సీఆర్‌డీఏ రద్దుకు కేబినెట్‌ ఆమోదం

పులివెందుల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం

ఏఎంఆర్డీఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి లోకాయుక్త విచారణకు ఆమోదం

రైతుల కూలీలకు ఇచ్చే పరిహారాన్ని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంపు

రైతులకు 15 ఏళ్లపాటు కౌలు చెల్లించేందుకు నిర్ణయం

రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయం

హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం

అమరావతిలోనే కొనసాగనున్న అసెంబ్లీ

విశాఖ కేంద్రంగా సచివాలయం కార్యకలాపాలు

రాష్ట్రాన్ని 4 పరిపాలన జోన్లులా విభజించాలని నిర్ణయం

జిల్లాల విభజన తర్వాత సూపర్‌ కలెక్టరేట్ వ్యవస్థ ఏర్పాటు

మంత్రులు రెండు చోట్లా అందుబాటులో ఉండాలని నిర్ణయం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు