
రేపు కేసీఆర్ కాళేశ్వరం పర్యటన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ తుపాకులగూడెం ఆనకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. తుపాకులగూడెం రిజర్వాయర్‌కు సమ్మక్క బ్యారేజీగా పేరు పెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమ్మక్క బ్యారేజీగా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాల్సిందిగా ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావును సీఎం ఆదేశించారు. పర్యటనలో భాగంగా మరికొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరి ఈరోజు రాత్రి కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో బసచేయనున్నారు. రేపు ఉదయం అక్కడనుంచి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం వెళ్లి ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మీ ఆనకట్టను పరిశీలించనున్నారు. ఆనకట్టలో నదీ జలాల నిల్వ తీరు, ఆనకట్టకు సంబంధించిన విషయాలు, ఇతరత్రా అంశాలపై అక్కడే ఇంజినీర్లు, అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం గోదావరి నదితో పాటు పరసర ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తారు. లక్ష్మీ ఆనకట్టతో పాటు సరస్వతి, పార్వతి ఆనకట్టల నుంచి ఎల్లంపల్లి వరకు ఉన్న నీటి నిల్వలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులతో కేసీఆర్ సమీక్షించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.