అక్రమాలను ప్రశ్నిస్తే వేధింపులా?: పవన్‌

ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే పోలీసు వేధింపులా అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజలకే జవాబుదారీ, అధికార

Published : 22 May 2020 01:39 IST

విజయవాడ: ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే పోలీసు వేధింపులా అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజలకే జవాబుదారీ, అధికార పక్షానికి కాదన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోందన్నారు. జనసేన నేత లోకేశ్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన పోలీసు అధికారిపై చర్యలు వెంటనే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్రమాలను ప్రశ్నించిన వారినే వేధించడం చట్ట సమ్మతమా అని నిలదీశారు. పోలీసులు, అధికార పార్టీ నాయకుల వేధింపులపై ప్రజాస్వామ్య ధోరణిలో పోరాడాలని పార్టీ శ్రేణులకు పవన్‌ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని