ప్రశ్నిస్తే పీడీ కేసులు.. నిలదీస్తే ఐటీ దాడులు

ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ.. దాడులు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని సీఎల్పీ నాయకుడు,

Updated : 22 Apr 2022 05:52 IST

‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్రలో భట్టి విక్రమార్క

చిలుకూరులో పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క

మధిర గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ.. దాడులు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని సీఎల్పీ నాయకుడు, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. మధిర మండలం చిలుకూరులో గురువారం ‘పీపుల్‌ మార్చ్‌’ పాదయాత్ర ప్రారంభమై ఆంధ్రా ప్రాంతం దొడ్డదేవరపాడు, వెల్లంకి సర్కిల్‌ మీదుగా తొర్లపాడు, సాయిపురం, తొండలగోపవరం చేరింది. అక్కడి నుంచి ఎర్రుపాలెం మండలం మీనవోలు చేరుకుంది. వివిధ గ్రామాల్లో భట్టి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులపై కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేయిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా పీడీ కేసులు పెట్టిస్తోందని ఆరోపించారు. ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయిగణేశ్‌ ఆత్మహత్య, రామాయంపేటలో సంతోష్‌, అతని తల్లి సజీవ దహనం ఘటనలు ఇందుకు నిదర్శమన్నారు. మాజీ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హన్మంతరావు పాదయాత్రలో పాల్గొన్నారు. తొండలగోపవరం వద్ద పాదయాత్రలో భట్టి విక్రమార్క వెంట నడిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని