అబద్ధాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షులు: జగదీశ్‌రెడ్డి

గత ప్రభుత్వాల పాలనలో కరెంట్‌ కోసం రైతులు రాస్తారోకోలు చేశారని, ఎరువుల కోసం పడిగాపులు కాశారని.. తెలంగాణ సాధించి కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 29 Mar 2023 05:29 IST

మునుగోడు, న్యూస్‌టుడే: గత ప్రభుత్వాల పాలనలో కరెంట్‌ కోసం రైతులు రాస్తారోకోలు చేశారని, ఎరువుల కోసం పడిగాపులు కాశారని.. తెలంగాణ సాధించి కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లా మునుగోడులో మంగళవారం జరిగిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గుజరాత్‌లో ఆరు గంటలే కరెంట్‌ ఇస్తున్నారని.. అందులో ఆరు నిమిషాలు కూడా ఉచితంగా ఇవ్వడం లేదని చెప్పారు. రైతు వ్యతిరేక, కరెంట్‌ చట్టాలను తీసుకొచ్చి అదానీ, అంబానీలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. రుణమాఫీ ఆగడానికి భాజపా ప్రభుత్వమే కారణమన్నారు. మోదీ దోస్తులైన అదానీ, అంబానీలకు వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకే గరిష్ఠ డిమాండ్‌ సమయంలో కరెంట్‌పై 20 శాతం అధిక ఛార్జీలు వేసి.. 139 కోట్ల మంది ప్రజలపై భారం మోపేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని