జనసేన ఫ్లెక్సీల తొలగింపుతో ఉద్రిక్తత

జనసేన ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదంగా మారింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండు రోజుల క్రితం ‘పేదలకు-పెత్తందారులకు మధ్య యుద్ధం’ అంటూ కూడళ్లలో ఫ్లెక్సీలను వైకాపా ఏర్పాటు చేసింది.

Published : 31 May 2023 04:38 IST

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: జనసేన ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదంగా మారింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండు రోజుల క్రితం ‘పేదలకు-పెత్తందారులకు మధ్య యుద్ధం’ అంటూ కూడళ్లలో ఫ్లెక్సీలను వైకాపా ఏర్పాటు చేసింది. వీటికి ప్రతిగా జనసేన మంగళవారం ‘సామాన్య ప్రజలకు- రాక్షస పాలనకు మధ్య పోరు’ శీర్షికతో ఫ్లెక్సీలను పెట్టింది. వైకాపా యువ నాయకుడు పేర్ని కిట్టూ పేరుతో ఏర్పాటైన వాటిని అలాగే ఉంచిన కార్పొరేషన్‌ అధికారులు.. జనసేన నాయకుడు కొరియర్‌ శ్రీను పెట్టిన ఫ్లెక్సీల్లో ఒకదాన్ని గంటల వ్యవధిలోనే తొలగించారు. మరో దాన్నీ తీసివేస్తుండగా శ్రీను, జన సైనికులు వచ్చి అధికార పార్టీవి వదిలి.. ప్రతిపక్షాలవే ఎందుకు తొలగిస్తున్నారంటూ కార్పొరేషన్‌ సిబ్బందిని నిలదీశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ఆర్‌పేట పోలీసులు వచ్చి కొరియర్‌ శ్రీనును అదుపులోకి తీసుకొని బంటుమిల్లి పోలీసు స్టేషన్‌కు తరలించి రాత్రి విడిచిపెట్టారు. అధికారుల తీరును తెదేపా నాయకులు ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని