క్విడ్‌ప్రోకో మాదిరిగా అవినాష్‌ వ్యవహారం: సీపీఐ నేత నారాయణ

తెలంగాణ సాధించి దశాబ్దం కావస్తున్నా... భూ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు.

Published : 03 Jun 2023 04:47 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ సాధించి దశాబ్దం కావస్తున్నా... భూ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మఖ్దూంభవన్‌లో జాతీయజెండాను పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ‘‘నాడు తెలంగాణ విషయంలో అన్ని పార్టీలు ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరించగా సీపీఐ మాత్రమే స్పష్టంగా మద్దతిచ్చింది. రాష్ట్రంలో సరిపడా వనరులున్నా.. ఇంకా నిరుద్యోగ సమస్య కొనసాగుతుండడం బాగాలేదు. ఏపీ సీఎం జగన్‌ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవగానే శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిపోతారు. అవినాష్‌రెడ్డి వ్యవహారమూ తెలిసిందే. ఇదంతా క్విడ్‌ప్రోకో మాదిరిగా ఉంది. ఎమ్మెల్సీ కవితను లక్ష్యం చేయడానికే ఆంధ్ర సీఎంను భాజపా వాడుకుంటోంది’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని