ఏపీ నేతలకు మాటలెక్కువ.. పని తక్కువ
ఏపీ నేతల మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం తక్కువని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో శనివారం ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇద్దరు నాయకుల తీరుతో బోర్లా పడిన ఆ రాష్ట్రం
తెలంగాణ ప్రజలు తలెత్తుకునేలా కేసీఆర్ పాలన
మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు
సంగారెడ్డి టౌన్, కొండాపూర్, న్యూస్‌టుడే: ఏపీ నేతల మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం తక్కువని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో శనివారం ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీకి చెందిన ఇద్దరు నేతల తీరు కారణంగా ఆ రాష్ట్రం ఇప్పుడు బోర్లా పడిందని ఎద్దేవా చేశారు. ఓ నేత తనను తాను దేశంలో ఉత్తమ అడ్మినిస్ట్రేటర్‌గా, హైటెక్ నేతగా చెప్పుకొనేవారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటలు తక్కువ మాట్లాడుతూ.. చేతల్లో దేశానికే ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి తప్పుచేశానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించినట్లు తాను విన్నానని, అప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారు ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు.
‘‘తెలంగాణ ఏర్పడితే చీకట్లే మిగులుతాయని, నక్సలైట్ల రాజ్యం వస్తుందని, హైదరాబాద్‌లో నిత్యం కర్ఫ్యూ ఉంటుందన్న వారి మాటలు పూర్తి అవాస్తవమని కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో నిరూపించారు. రాష్ట్ర ప్రజలు తల ఎత్తుకునేలా చేశారు. పైసా లంచం లేకుండా ఇప్పటివరకు 60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకంతో రూ.60 వేల కోట్లు జమయ్యాయి. ధరణి వల్లే ఇది సాధ్యమవుతోంది’’ అని హరీశ్‌రావు తెలిపారు. దివ్యాంగులకు పింఛను పెంపు ప్రకటనను హర్షిస్తూ.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి దివ్యాంగులతో కలిసి హరీశ్‌రావు పాలాభిషేకం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్‌గా బక్కి వెంకటయ్య
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
TTD: సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు