Balineni: మాగుంట రాఘవరెడ్డిపై కుట్ర.. వైకాపా అండగా నిలవాలి: బాలినేని

‘ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డిపై కొందరు కుట్ర చేశారు. దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఆయనను ఇరికించారు.

Updated : 01 Sep 2023 07:44 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డిపై కొందరు కుట్ర చేశారు. దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఆయనను ఇరికించారు. రాఘవరెడ్డి ప్రజల్లోకి రావాలి. ప్రకాశంజిల్లా రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషించాలి. ఇటువంటి తరుణంలో ఆ కుటుంబానికి వైకాపా శ్రేణులు అండగా నిలవాల్సిన అవసరం ఉంది’ అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కొన్నినెలల పాటు తిహార్‌ జైలులో ఉన్న మాగుంట రాఘవరెడ్డికి ఇటీవల బెయిల్‌ లభించింది. జైలు నుంచి విడుదలైన ఆయన తొలిసారిగా గురువారం ప్రకాశం జిల్లాకు వచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ మాగుంట కుటుంబం గత నలభై, యాభై ఏళ్లుగా మద్యం వ్యాపారంలోనే ఉందని.. వారిపై ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలూ లేవన్నారు. భేటీలో బాలినేని ప్రణీత్‌రెడ్డి, సూపర్‌బజార్‌ ఛైర్మన్‌ తాతా ప్రసాద్‌ తదితరులున్నారు. రాఘవరెడ్డికి వల్లూరమ్మ దేవస్థానం వద్ద వైకాపా శ్రేణులు పూలతో స్వాగతం పలికారు. గజమాలలతో ఎంపీ మాగుంట, రాఘవరెడ్డిలను సత్కరించారు. ఆ తరవాత వారు ప్రదర్శనగా ఒంగోలులోని నివాసానికి చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని