Kodali Nani: దేవాలయ ప్రాంగణంలో కొడాలి నాని బూతు పురాణం

పవిత్రతకు, ఆధ్యాత్మికతకు నెలవైన దేవాలయాన్ని రాజకీయ కార్యక్రమాలకు వేదిక చేసుకొని ప్రత్యర్థులను దూషించడానికి వాడుకున్నారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ కాకర్ల వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో రూ.30 లక్షలతో నిర్మించిన కాలక్షేప మండపాన్ని కొడాలి నాని గురువారం ప్రారంభించారు.

Updated : 08 Sep 2023 07:04 IST

గుడివాడ(నెహ్రూచౌక్‌), న్యూస్‌టుడే: పవిత్రతకు, ఆధ్యాత్మికతకు నెలవైన దేవాలయాన్ని రాజకీయ కార్యక్రమాలకు వేదిక చేసుకొని ప్రత్యర్థులను దూషించడానికి వాడుకున్నారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ కాకర్ల వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో రూ.30 లక్షలతో నిర్మించిన కాలక్షేప మండపాన్ని కొడాలి నాని గురువారం ప్రారంభించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడటం, చంద్రబాబుపై విమర్శలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కాలక్షేప మండప ప్రారంభోత్సవ వేదికను సైతం వైకాపా రంగులతో కూడిన బెలూన్లతో నింపేశారు. దేవాలయాన్ని రాజకీయాలకు వాడుకోవటం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని