లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోకి 30 మంది భారాస ఎమ్మెల్యేలు: మంత్రి కోమటిరెడ్డి

యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే తనపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Updated : 23 Jan 2024 10:57 IST

ఈనాడు, నల్గొండ: యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే తనపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. విద్యుత్కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్‌, సిటింగ్‌ జడ్జి విచారణ అనంతరం కేసీఆర్‌ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లేది ఆయనేనని చెప్పారు. తమ ప్రభుత్వం పడిపోదని.. పూర్తికాలం అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాసలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని.. కాంగ్రెస్‌లోకి 30 మంది వస్తారని పేర్కొన్నారు.

నల్గొండ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంతో పాటు తిప్పర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టిన తన గురించి జగదీశ్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. వంద రోజుల్లోపు గ్యారంటీలను అమలు చేస్తామని.. కరెంటు బిల్లులు కట్టొద్దని అనడం మానుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి వెంకట్‌రెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని