Eluru: మీడియాపై వైకాపా కార్యకర్తల దాడి

‘సిద్ధం’ సభ కవరేజీకి హాజరైన మీడియా ప్రతినిధులపై వైకాపా కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. సీఎం ప్రసంగాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో వైకాపా కార్యకర్తలు  ఒక్కసారిగా మీడియా గ్యాలరీలోకి ప్రవేశించారు.

Updated : 04 Feb 2024 08:05 IST

మద్యం మత్తులో ప్రెస్‌ గ్యాలరీలోకి ప్రవేశం

ఈనాడు, ఏలూరు: ‘సిద్ధం’ సభ కవరేజీకి హాజరైన మీడియా ప్రతినిధులపై వైకాపా కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. సీఎం ప్రసంగాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా మీడియా గ్యాలరీలోకి ప్రవేశించారు. మద్యం మత్తులో విలేకరులపై పడి వికృతంగా ప్రవర్తించారు. బయటికి వెళ్లాలని కొందరు చెప్పటంతో ‘మీరెవరు మాకు చెప్పడానికి’ అంటూ దూసుకొచ్చారు. ప్రతిఘటించిన వారిని తోసేయడంతో పలువురు విలేకరులు కింద పడి గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసు ఉన్నతాధికారులు సైతం అదుపు చేయలేదని తెలిసింది.

సీఎంపైకీ దూసుకెళ్లారు

జగన్‌ ర్యాంపుపై నడుస్తున్న సమయంలో కొందరు యువకులు ఆయన వైపు దూసుకొచ్చారు. జనం గ్యాలరీల్లో ఉండి అభివాదం చేస్తుండగా వీరు బారికేడ్లు దూకి వేదికపైకి వెళ్లారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారిని నిలువరించారు. చిర్ల జగ్గిరెడ్డికి కొత్తపేట సీటు ఇవ్వలేదన్న ఉద్దేశంతోనే సీఎంపై దాడి చేసేందుకు కార్యకర్తలు గంజాయి తాగి ఎగబడ్డారని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని