సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు

ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిల్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది.

Published : 19 Mar 2024 05:05 IST

హైకోర్టులో కేఏ పాల్‌ వ్యాజ్యం..

ఈనాడు, అమరావతి: ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిల్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. పాల్‌ వినతిపై నిర్ణయం తీసుకుని తగు ఉత్తర్వులివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌.విజయ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. అంతకుముందు పిటిషనర్‌ కేఏ పాల్‌ నేరుగా వాదనలు వినిపిస్తూ... ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిందని, ఏపీలో ఎన్నికలకు ఓట్ల లెక్కింపునకు మధ్య 21 రోజుల గడువు ఉందన్నారు. ఈ మధ్యలో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని వివరించారు. గతంలో నాలుగువేల ఈవీఎంలను రీప్లేస్‌ చేశారనే ఆరోపణలు వచ్చాయని, దీనిపై పోలీసు కేసులూ నమోదయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని పిటిషనర్‌ పోరాడుతున్నారంది. కేఏ పాల్‌ ఇచ్చిన వినతిపై తగు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర సీఈవోను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని