ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో ఫొటోలు తొలగించాలి

ప్రభుత్వశాఖల వెబ్‌సైట్‌లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు.

Updated : 19 Mar 2024 06:16 IST

సీఈఓకు అచ్చెన్నాయుడి లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వశాఖల వెబ్‌సైట్‌లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా.. వాటిల్లో సీఎం, మంత్రుల చిత్రాలు అలాగే ఉన్నాయని సోమవారం సీఈఓకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ వెబ్‌సైట్లలో రాజకీయ నాయకుల ఫొటోలు ఉండకూడదు. వీటిని తొలగించాలని వివిధ శాఖల కార్యదర్శులకు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేయాలి’ అని అందులో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని