TDP: ఎన్నికల వ్యూహంపై తెదేపా కసరత్తు

తెలుగుదేశం పార్టీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులకు ఈ నెల 23న విజయవాడలో ప్రత్యేక కార్యశాల (వర్క్‌షాప్‌) నిర్వహిస్తోంది. ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారు.

Updated : 21 Mar 2024 08:48 IST

పార్టీ అభ్యర్థులకు 23న వర్క్‌షాప్‌
హాజరవనున్న చంద్రబాబు

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులకు ఈ నెల 23న విజయవాడలో ప్రత్యేక కార్యశాల (వర్క్‌షాప్‌) నిర్వహిస్తోంది. ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం జరుగుతుంది. అభ్యర్థులతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వారు ఇప్పటికే నియమించుకున్న అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌, పొలిటికల్‌ మేనేజర్‌, మీడియా మేనేజర్‌, సోషల్‌ మీడియా మేనేజర్లను కార్యశాలకు పిలిచారు. రాబోయే రెండు నెలల ఎన్నికల కార్యాచరణ, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వర్క్‌షాప్‌లో వారికి అవగాహన కల్పిస్తారు.

తెదేపా ఇంకా లోక్‌సభ అభ్యర్థులతో పాటు, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఆ జాబితాల్ని గురు లేదా శుక్రవారాల్లో ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. 26 నుంచి ‘ప్రజాగళం’ పేరుతో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభిస్తారు. రోజుకో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పర్యటన ఉంటుంది. ఉదయం ఒక శాసనసభ నియోజకవర్గంలో 10 వేల మందితో ప్రజాగళం సభ జరుగుతుంది. మధ్యాహ్నం 4.30 గంటలకు ఒక నియోజకవర్గంలో, రాత్రి 7.30కు మరో నియోజకవర్గంలో రోడ్డుషో నిర్వహిస్తారు. 26 నుంచి సుమారు 20 రోజులపాటు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని