జన సమీకరణకు వైకాపా వల

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం సీఎం పర్యటన నేపథ్యంలో మద్యం పారించయినా, డబ్బులు వెదజల్లయినా జనాలను తరలించేందుకు వైకాపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. రెండు లక్షల మందిని రప్పించి బలప్రదర్శన చేయాలని ప్రయత్నిస్తోంది.

Updated : 16 Apr 2024 04:43 IST

రూ.500, మద్యం సీసా, బిర్యానీ ఇస్తామంటూ ప్రలోభాలు

ఈనాడు, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం సీఎం పర్యటన నేపథ్యంలో మద్యం పారించయినా, డబ్బులు వెదజల్లయినా జనాలను తరలించేందుకు వైకాపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. రెండు లక్షల మందిని రప్పించి బలప్రదర్శన చేయాలని ప్రయత్నిస్తోంది. సమావేశానికి వచ్చేవారి పేర్లను సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి జిల్లాలోని వైకాపా నాయకులు, గృహసారథులు, కన్వీనర్లు నమోదు చేసుకుంటున్నారు. బస్సెక్కగానే రూ.500, మద్యం సీసా ఇస్తామని, రెండు పూటలా బిర్యానీ పెడతామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లు జన సమీకరణ కోసం ఇంటింటికీ వెళ్లి ప్రజలను సభకు రావాలని పిలుస్తున్నారు.

నియమావళి ఉంటే మాకేంటి?: బస్సు యాత్ర సోమవారం రాత్రి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకోనుంది. జగన్‌ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఈ ప్రాంతానికి సమీపంలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో భారీ ఫ్లెక్సీలను పెట్టారు. భీమవరం సభకు ఉమ్మడి పశ్చిమతోపాటు, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలనుంచి 1200 బస్సులు కేటాయించారు. ఆయా జిల్లాల్లో సామాన్య బస్సు ప్రయాణికులు ఇక్కట్లు తప్పేలా లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని