Harish Rao: ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపించి తప్పించుకోవద్దు: హరీశ్‌రావు

కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

Published : 26 Jan 2024 19:15 IST

సిద్దిపేట: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత సహా విభజన హామీలు, బీసీ జనగణన తదితర అంశాలపై ఎంపీలు పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపించాలని భారాస పార్లమెంటరీ పార్టీ నిర్ణయించినట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వివిధ అంశాలపై ఆయా శాఖల కేంద్ర మంత్రులను ఎంపీలు కలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కాంగ్రెస్, భాజపా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యాయన్నారు.

‘‘గత పదేళ్లుగా కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు ఇవ్వకుండా.. అనేక విషయాలపై స్పష్టత ఇవ్వాలని అడిగాం. స్పష్టత లేకుండా ప్రాజెక్టులు అప్పగించబోమని గతంలో తేల్చి చెప్పాం. కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారు. వారి అహంకారపూరిత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. హామీలు అమలు చేయాలని అడిగితే అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. భారాస హయాంలో విచారణలు చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమో ఒకసారి పరిశీలించుకోవాలి. పాలనపై కాకుండా ప్రతిపక్షాలపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపించి తప్పించుకోవద్దు’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని