సీఎం గేట్లు తెరావాల్సింది నేతల కోసం కాదు.. రైతుల కోసం: హరీశ్‌రావు

రైతులకు ఎకరానికి రూ.25వేల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 24 Mar 2024 16:02 IST

దేవరుప్పల: సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గేట్లు తెరావాల్సింది నేతల కోసం కాదు.. రైతుల కోసమని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. చేరికల కోసం భారాస ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్తున్న సీఎం... రైతులు చనిపోతుంటే పరామర్శించేందుకు మాత్రం వెళ్లడం లేదని విమర్శించారు. జనగామ జిల్లా దేవరుప్పలలో ఆదివారం ఆయన పర్యటించారు. ఎండిన పంటలు పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఎం, మంత్రులు రైతుల వద్దకు వెళ్లి వారిలో ఆత్మవిశ్వాసం కల్పించాలని కోరారు. కాంగ్రెస్‌ 100 రోజుల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని