HD Kumaraswamy: ప్రజలు సమస్యల్లో ఉంటే కర్ణాటక నీరో క్రికెట్ మ్యాచ్‌ చూస్తూ కూర్చున్నారు: కుమారస్వామి

కర్ణాటకలోని (Karnataka) అధికార కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వంపై జేడీఎస్‌ (Jds) నేత, మాజీ సీఎం కుమారస్వామి (kumaraswamy) విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరెంటు కొరతను ప్రభుత్వమే సృష్టించిందని ఆరోపించారు. 

Published : 22 Oct 2023 17:37 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో కాంగ్రెస్‌ (Congress) పాలన కాకుండా ‘స్కాంగ్రెస్‌’ పాలన కొనసాగుతోందని జేడీఎస్‌ (Jds) నేత, మాజీ సీఎం కుమారస్వామి (kumaraswamy) ఘాటుగా విమర్శించారు. ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్రికెట్ మ్యాచ్‌ చూడటాన్ని తప్పుపట్టారు. ‘రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడు. ఇక్కడ ప్రజలు సమస్యల్లో ఉంటే కర్ణాటక నీరో క్రికెట్ మ్యాచ్‌ చూస్తున్నాడని’ ట్విటర్‌లో పోస్టు పెట్టారు. 

ఏడాది తర్వాత భాజపా కార్యాలయానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌

కర్ణాటక రాష్ట్రం విద్యుత్‌ సమస్యను ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు క్రికెట్‌ చూడటంలో మునిగిపోయారని దుయ్యబట్టారు. కరెంటు కొరతను ప్రభుత్వమే సృష్టించిందని ఆరోపించారు. కమీషన్ల కోసమే బయటి నుంచి కరెంటును కొనుగోలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 32,912 మెగావాట్లను ఉత్పత్తి చేసే వ్యవస్థ ఉన్నప్పటికీ నిర్వహణ లోపం కారణంగా 12వేల మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతోందన్నారు. విద్యుత్‌ లోటుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే, మ్యాచ్‌ను వీక్షించడంపై వచ్చిన విమర్శలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఖండించారు. జీవితం అంటే రాజకీయాలు మాత్రమే కాదని అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు