CM KCR: మైనార్టీల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేసీఆర్‌

రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ వింద్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న...

Published : 29 Apr 2022 19:05 IST

హైదరాబాద్‌: రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ వింద్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మైనార్టీల పిల్లలకు పాఠశాలలు, వసతి గృహాలు నిర్మించామన్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యలు లేకుండా చేశాం, అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని సీఎం వివరించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ముస్లిం మత పెద్దలు ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని