Sita Soren: జేఎంఎంకు షాక్‌..! భాజపాలోకి శిబూ సోరెన్‌ పెద్ద కోడలు

జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌ పెద్ద కోడలు, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ వదిన సీతా సోరెన్‌ మంగళవారం భాజపాలో చేరారు.

Published : 19 Mar 2024 16:02 IST

రాంచీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ ఝార్ఖండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (JMM) అధినేత శిబూ సోరెన్‌ పెద్ద కోడలు, మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ వదిన సీతా సోరెన్‌ (Sita Soren) భాజపాలో చేరారు. భాజపా (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. అంతకు కొన్ని గంటల ముందు ఆమె జేఎంఎంకు రాజీనామా చేశారు. పార్టీలో తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏకాకిని చేశారని ఆరోపించారు.

సోరెన్‌ కుటుంబంలో ‘ఇంటిపోరు’.. కల్పనకు ‘సీత’ చెక్‌!

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన హేమంత్‌ స్థానంలో ఆయన సతీమణి కల్పనాకు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయంటూ ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఆమెను ముఖ్యమంత్రి చేసేందుకు తాను వ్యతిరేకం అంటూ సీతా సోరెన్‌ బహిరంగ ప్రకటన చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా.. మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్న సీతా సోరెన్‌ రాకతో రాష్ట్రంలోని ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు భాజపా చేస్తోన్న ప్రయత్నాలకు పెద్ద ఊతం లభించినట్లయ్యింది. ఈ వర్గం ఓటర్లు జేఎంఎంకు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని