BRS: ప్రవీణ్‌కుమార్‌ను భారాస ప్రధాన కార్యదర్శిగా నియమిస్తాం: కేసీఆర్‌

తమ పార్టీలో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో అవకాశం కల్పిస్తామని భారాస అధినేత కేసీఆర్‌ తెలిపారు.

Published : 18 Mar 2024 22:06 IST

హైదరాబాద్‌: తమ పార్టీలో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో అవకాశం కల్పిస్తామని భారాస అధినేత కేసీఆర్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన నివాసంలో ప్రవీణ్‌ కుమార్‌ను కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రవీణ్‌కుమార్‌ను భారాస ప్రధాన కార్యదర్శిగా నియమిస్తాం. పార్టీ నిర్మాణం చేసుకుందాం.. కమిటీలు వేసుకుందాం. రానున్న రోజుల్లో మనం అద్భుతమైన విజయం సాధిస్తాం. బహుజన సిద్ధాంతం అమలు దిశగా దేశానికి తెలంగాణను టార్చ్‌ బేరర్‌గా చేద్దాం’’ అని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని