kesineni chinni: అక్రమాలు బయటపడుతున్నాయనే కేశినేని నాని పార్టీ మారారు : కేశినేని చిన్ని

వైకాపాకు వెళ్లిన కేశినేని నానిపై తెదేపా సీనియర్ నేత కేశినేని శివనాథ్(చిన్ని) తీవ్ర విమర్శలు చేశారు.

Published : 17 Feb 2024 12:30 IST

విజయవాడ: వైకాపాకు వెళ్లిన కేశినేని నానిపై తెదేపా సీనియర్ నేత కేశినేని శివనాథ్(చిన్ని) తీవ్ర విమర్శలు చేశారు. ‘‘వైకాపాలో విజయవాడ ఎంపీ సీటు ఇంకా ఖరారు కాలేదు. చంద్రబాబుని విమర్శించే వారిని ముందు ప్రోత్సహించి.. తర్వాత సీటు ఎగ్గొట్టటం జగన్ నైజం. విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో చూడాలి. విజయవాడ పశ్చిమలో తెలుగుదేశం టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి వద్ద డబ్బులు వసూలు చేశారు. ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతాం. నానికి డబ్బులిచ్చి మోసపోయిన వారు త్వరలోనే మీడియా ముందుకు వస్తారు. అక్రమాలు బయటపడుతున్నాయనే ఆయన పార్టీ మారారు. మరో 2 నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరం కావటం ఖాయం’’ అని కేశినేని చిన్ని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని