Kishanreddy: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్ష భగ్నం

కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన ‘24 గంటల నిరాహార దీక్ష’ను  పోలీసులు భగ్నం చేశారు.

Published : 13 Sep 2023 20:28 IST

హైదరాబాద్‌: కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన ‘24 గంటల నిరాహార దీక్ష’ను  పోలీసులు భగ్నం చేశారు. ఈక్రమంలో భాజపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు కిషన్‌రెడ్డితో పాటు పలువురు నాయకులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.  బుధవారం సాయంత్రం 6గంటల వరకే దీక్షకు అనుమతి ఉందని, వెంటనే దీక్షా శిబిరం ఖాళీ చేయాలని 6.30గంటల సమయంలో పోలీసులు కిషన్‌డ్డికి సూచించారు. గురువారం ఉదయం 6గంటల వరకు దీక్ష చేస్తానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులను హెచ్చరించారు. వెనక్కి తగ్గిన పోలీసులు.. రాత్రి 8గంటల సమయంలో మరోసారి ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కిషన్‌రెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా తరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని