Telangana News: కుటుంబ పార్టీల కారణంగా దేశంలో పెరిగిన అవినీతి: కిషన్‌ రెడ్డి

తెలంగాణలో తప్పకుండా మార్పు వస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, వారు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.

Published : 28 May 2022 02:50 IST

హైదరాబాద్‌: తెలంగాణలో తప్పకుండా మార్పు వస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, వారు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘‘రూ.వందల కోట్లు ఖర్చు చేసినా.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ప్రజలు అనుకున్న వారికే ఓట్లు వేశారు. ఎస్సీ సమాజానికి కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం వారిని సీఎం చేస్తారా?. వచ్చే ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయి. సిద్ధాంత పరంగా కుటుంబ రాజకీయాలకు భాజపా వ్యతిరేకం. ప్రధానంగా కుటుంబ పార్టీలను వ్యతిరేకిస్తున్నాం. కుటుంబ పార్టీలు పూర్తిగా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. ఈ కుటుంబ పార్టీల కారణంగా దేశంలో అవినీతి పెరిగిపోయింది.
మాపై తెరాస ఎంత విషం చిమ్మినా.. ఆ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరు. మాది ప్రజాస్వామ్య పార్టీ. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పార్టీ భాజపా’’ అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని