సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను నేటి తరానికి అందించాలి: కిషన్‌రెడ్డి

బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన సాహసి సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను నేటి తరానికి అందించేందుకు విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 18 Aug 2023 15:12 IST

చౌటుప్పల్‌: బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన సాహసి సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను నేటి తరానికి అందించేందుకు విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆయన విగ్రహానికి కిషన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మొఘలులకు వ్యతిరేకంగా గొరిల్లా యుద్దంతో పోరాడి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఇలాంటి మహనీయుల చరిత్రను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా గత సంవత్సరం సర్వాయి పాపన్న తపాలబిళ్ల, పోస్టల్‌ కార్డును ప్రధాని విడుదల చేశారని చెప్పారు. సర్వాయి పాపన్న లక్ష్యాలను గుర్తుచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ దూడల భిక్షంగౌడ్‌, నాయకులు జంగయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని