Kishanreddy: కేంద్రం ఇచ్చిన నిధులపై కేటీఆర్‌తో చర్చకు సిద్ధం: కిషన్‌రెడ్డి

భారత్‌ అఫ్గానిస్థాన్‌గా మారుతుందని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. 

Updated : 14 Jan 2023 20:49 IST

హైదరాబాద్‌: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వీకరించారు. కేసీఆర్‌  రాజీనామా పత్రాన్ని రాసుకొని కేటీఆర్‌ వస్తే చర్చించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి రాలేదని ఎద్దేవా చేశారు. కుర్‌ కురే పంపిణీపై కేటీఆర్‌ మాట్లాడటం అనాథ చిన్నారులను అవమానించడమేనని మండిపడ్డారు. భారత్‌ అఫ్గానిస్థాన్‌గా మారుతుందని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఉన్నాయని ఆక్షేపించారు. మమ్మల్ని తిట్టండి కానీ, దేశ ప్రతిష్ఠను మాత్రం దిగజార్చ వద్దని హితవు పలికారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా ఆదివారం ఉదయం వందే భారత్‌ రైలును కేంద్రం ప్రారంభిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని