CPI-CPM: సీట్ల విషయం త్వరగా తేల్చాలి.. KCR అపాయింట్‌మెంట్‌ కోరిన వామపక్ష నేతలు

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌తో వామపక్షాల నేతలు చర్చలు జరపాలని నిర్ణయించారు. అపాయింట్‌మెంట్‌ ఖరారు కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం ఇతర నేతలు భేటీ కానున్నారు. 

Published : 24 Jun 2023 20:48 IST

హైదరాబాద్‌: భారాస అధినేత, సీఎం కేసీఆర్‌తో వామపక్షాల నేతలు చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈనెల 21న ముగ్దూం భవన్‌లో సీపీఐ, సీపీఎం కార్యదర్శులు, ముఖ్యనేతలు సమావేశమై భారాసతో చర్చలు జరపాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇందుకుగాను ఆ పార్టీ నేతలు సీఎం అపాయింట్‌మెంట్‌ కోరారు. ఒకట్రెండు రోజుల్లో అపాయింట్‌మెంట్‌ ఖరారు చేస్తామని సీఎంవో సమాచారమిచ్చింది. అపాయింట్‌మెంట్‌ ఖరారు కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం ఇతర నేతలు భేటీ కానున్నారు. ఎన్నికల్లో ఈ పార్టీలకు కేటాయించే సీట్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని భారాసపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో సీట్ల విషయం త్వరగా తేల్చాలని, ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందనే భావనలో వామపక్ష నేతలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని