Andhra News: విశాఖ అంటే జగన్‌కు ఎనలేని ప్రేమ: అవంతి శ్రీనివాస్‌

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్రమంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. విశాఖ సర్క్యూట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 

Published : 14 Mar 2022 01:59 IST

విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్రమంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. విశాఖ సర్క్యూట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చాలా మంది రాజధాని ఆగిపోయిందని ప్రచారం చేస్తున్నారని, అమరావతి అక్కడే ఉంటుందన్నారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటూనే, మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే తప్పేముందని ప్రశ్నించారు. కర్ణాటక, ఝార్ఖండ్‌ సీఎంలు కూడా 3 రాజధానులు పెట్టాలని అనుకుంటున్నారని తెలిపారు. ఇక్కడి ప్రజలు సౌమ్యులు, మంచివాళ్లు అందుకే విశాఖ అంటే సీఎం జగన్‌కు ఎనలేని ప్రేమ, అభిమానం ఉందన్నారు.

‘‘జిల్లా విభజన పరిపాలన వికేంద్రీకరణకు సౌకర్యంగా ఉంటుంది. జనాభా పరంగా మూడో పెద్ద జిల్లా విశాఖ. జిల్లాల వారీగా విభజన కావడం వల్ల సౌకర్యాలు వస్తాయి. జిల్లాల విభజన విషయంలో నటుడు బాలకృష్ణ హిందూపురం జిల్లా కావాలని కోరారు. రాష్ట్రం ఎక్కువ అప్పులు చేసిందని భాజపా నేతలు అంటున్నారు. కేంద్రం అప్పులు చేయకుండానే దేశాన్ని పాలిస్తోందా?. భాజపా పాలిత రాష్ట్రాల మీదే ప్రేమ చూపకుండా మిగిలిన రాష్ట్రాలవైపు కూడా చూడాలి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మాలనే ఆలోచన మానుకోవాలి’’ అని అవంతి శ్రీనివాస్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని