తాడిపత్రిలో ఎవరినీ ప్రలోభ పెట్టడం లేదు: బొత్స

అనంతపురం మేయర్ అభ్యర్థిగా ముస్లిం మైనార్టీలకు, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా బలిజ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ

Published : 18 Mar 2021 01:17 IST

అనంతపురం: అనంతపురం మేయర్ అభ్యర్థిగా ముస్లిం మైనార్టీలకు, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా బలిజ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లాలోని 10 మున్సిపాలిటీల ఛైర్మన్లు, నగరపాలక సంస్థ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవుల ఖరారుపై బొత్స సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాడిపత్రిలో ఎవరినీ ప్రలోభ పెట్టడం లేదన్నారు. తాము సాధించిన మున్సిపాలిటీల్లో తాడిపత్రి ఒక్కటి చేజారినంత మాత్రన తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని.. ఈ విషయాన్ని తమ పార్టీకి చెందిన అక్కడి నేతలకు చెప్పామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని