Telangana News: పీజీ సీట్లు బ్లాక్ చేసినట్లు నిరూపిస్తే కళాశాలను సరెండర్‌ చేస్తా: పువ్వాడ అజయ్‌

పీజీ వైద్య సీట్లు బ్లాక్ చేసినట్లు రేవంత్ రెడ్డి నిరూపిస్తే తన వైద్య కళాశాలను ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు.

Published : 24 Apr 2022 01:43 IST

హైదరాబాద్: పీజీ వైద్య సీట్లు బ్లాక్ చేసినట్లు రేవంత్ రెడ్డి నిరూపిస్తే తన వైద్య కళాశాలను ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. ఒకవేళ నిరూపించ లేకపోతే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని పువ్వాడ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. పీజీ వైద్య సీట్లు బ్లాక్ చేస్తున్నామంటూ తనపై రేవంత్ రెడ్డి గవర్నర్‌కు తప్పుడు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో 20 ఏళ్లుగా పీజీ ప్రవేశాలు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ సమయంలోనే తన కళాశాలలో సీట్లన్నీ నిండిపోతాయని చెప్పారు. అలాంటప్పుడు సీట్లు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమే లేదన్నారు. రేవంత్ రెడ్డి ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని.. అవి పూర్తి నిరాధారమన్నారు. తప్పుడు ఆరోపణలతో బట్టకాల్చి మీదేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని