సీఎం అనుమతి లేకుండా ‘ఉక్కు’ ప్రైవేట్‌పరం కాదు

రాజ్యసభ ఛైర్మన్‌ విషయంలో సోమవారం జరిగిన ఘటన దురదృష్టకరమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో రఘురామకృష్ణరాజు...

Published : 10 Feb 2021 01:04 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్య

దిల్లీ: రాజ్యసభ ఛైర్మన్‌ విషయంలో సోమవారం జరిగిన ఘటన దురదృష్టకరమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. విజయసాయి వ్యాఖ్యలతో దిల్లీలో తమ పార్టీతో పాటు సీఎం జగన్‌ పరువు పోయిందని వ్యాఖ్యానించారు. ఆయన్ను రాజ్యసభలో వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండేవారిపై వ్యాఖ్యలు చేసే మంత్రులు, ఎంపీలకు రాజ్యాంగం గురించి అవగాహన తరగతులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర సీఎం అనుమతి లేకుండా విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాదన్నారు. షర్మిల పార్టీ పెట్టడం జగన్‌ డైరెక్షన్‌లో జరుగుతోందా? లేదా? అనేది త్వరలోనే తేలుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. 

ఇవీ చదవండి..
‘విశాఖ ఉక్కుకు ఒడిశా గనులు కేటాయించండి’
జగన్‌, షర్మిల మధ్య విభేదాలు లేవు: సజ్జల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు