TDP-JSP-BJP: చిలకలూరిపేట సభకు భూమిపూజ.. పాల్గొన్న నారా లోకేశ్‌

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఈ నెల 17న భారీ బహిరంగ సభ జరగనున్న సంగతి తెలిసిందే. తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

Updated : 13 Mar 2024 13:16 IST

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఈ నెల 17న భారీ బహిరంగ సభ జరగనున్న సంగతి తెలిసిందే. తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన భూమి పూజలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)తో పాటు మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు.

అనంతరం ప్రాంగణాన్ని అచ్చెన్నాయుడు, భాజపా, జనసేన నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. సభ నిర్వహణ కమిటీలతో ఏర్పాట్లపై చర్చించారు. లక్షలాదిగా ప్రజలు తరలిరానున్నారని.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సభతో ప్రధాని నరేంద్రమోదీ, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై కనిపించనున్నారు. మూడు పార్టీలూ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పొత్తు తర్వాత జరిగే తొలి సభ కావడంతో ఏర్పాట్లను లోకేశ్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని