Nara Lokesh - Yuvagalam: మరోసారి అడ్డుకున్న పోలీసులు.. స్టూల్‌పైనే నిల్చుని నిరసన తెలిపిన లోకేశ్

‘యువగళం’ (Yuvagalam) పాదయాత్రలో తెదేపా(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh)ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు.

Updated : 09 Feb 2023 14:18 IST

గంగాధర నెల్లూరు: ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్రలో తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. చిత్తూరు (Chittoor) జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆత్మకూరు నుంచి 14వ రోజు లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభించారు. దారిపొడవునా ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు.

సంసిరెడ్డిపల్లెలో ప్రజలు ఆయనకు హారతులిచ్చి స్వాగతం పలికారు. అక్కడి ప్రజలను ఉద్దేశించి లోకేశ్‌ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నిలుచున్న స్టూల్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. అక్కడికి మైక్‌ తీసుకొస్తున్న సహాయకుడిని అడ్డుకుని దాన్ని లాక్కున్నారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మైక్‌ ఎందుకు లాక్కున్నారో చెప్పాలని తెదేపా నేతలు పోలీసులపై మండిపడ్డారు.

చాలా సేపు స్టూల్‌పైనే నిలుచుని నిరసన తెలిపిన లోకేశ్‌..  పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని చూపిస్తూ ఆయన మాట్లాడారు. ‘‘మీలాంటి కొందరి మూలంగా పోలీస్‌శాఖకే చెడ్డ పేరొస్తోంది. మాది అంబేడ్కర్‌ రాజ్యాంగం. మమ్మల్ని అడ్డుకోమంటున్న మీ సొంత రాజ్యాంగంతో మాకు పనిలేదు’’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని