Nara Lokesh: రెండు నెలలు ఓపిక పట్టండి.. దొంగ కేసులు ఎత్తివేస్తాం: నారా లోకేశ్

వైకాపా పాలనలో రాష్ట్రంలో 300 మంది బీసీలను హత్య చేశారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఆరోపించారు.

Updated : 07 Mar 2024 13:10 IST

హిందూపురం: వైకాపా పాలనలో రాష్ట్రంలో 300 మంది బీసీలను హత్య చేశారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఆరోపించారు. హిందూపురంలో నిర్వహించిన ‘తెదేపా శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. 26వేల మంది బీసీలపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. రెండు నెలలు ఓపిక పట్టాలని.. ఆ దొంగ కేసులు ఎత్తివేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ వర్గాలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. బీసీలకు స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ఆదరణ పథకం కింద రూ.5వేల కోట్లు కేటాయిస్తామన్నారు. తెదేపా తీసుకొచ్చిన 100 సంక్షేమ కార్యక్రమాలను జగన్‌ రద్దు చేశారని లోకేశ్‌ విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని