EC: వైకాపా నేతలపై ఎన్నికల సంఘానికి నరసరావుపేట ఎంపీ ఫిర్యాదు

విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంపై వైకాపా అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో తన పేరుపై ట్వీట్‌ చేయడాన్ని నరసరావుపేట  ఎంపీ లావు కృష్ణదేవరాయలు తప్పుబట్టారు.

Updated : 23 Mar 2024 16:50 IST

అమరావతి: విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంపై వైకాపా అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో తన పేరుపై ట్వీట్‌ చేయడాన్ని నరసరావుపేట  ఎంపీ లావు కృష్ణదేవరాయలు తప్పుబట్టారు. శనివారం సచివాలయానికి వచ్చిన ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వైకాపా నేతలపై ఫిర్యాదు చేశారు. 

విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంలో ఎలాంటి ఆధారాల్లేకుండా వైకాపా ఆరోపణలు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు. ఈ కేసులో సీబీఐ విచారణకొనసాగుతోందని, నిజనిర్ధరణ కాకుండానే తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి సంబంధం లేకపోయినా ఆరోపణలు చేయడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేసిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని