Stalin: ప్రధాని అభ్యర్థి గురించి నిర్ణయం తీసుకోలేదు.. కానీ..!: చెన్నైలో స్టాలిన్‌

పట్నా భేటీలో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోలేదని తమిళనాడు సీఎం స్టాలిన్‌(stalin) అన్నారు.

Published : 23 Jun 2023 23:03 IST

చెన్నై: బిహార్‌లోని పట్నాలో జరిగిన విపక్షాల భేటీలో ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోలేదని తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్(MK Stalin) తెలిపారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా(BJP)ను ఓడించేందుకు అన్ని ప్రజాస్వామిక శక్తుల్ని ఏకం చేయాలని తీర్మానం చేసినట్టు వెల్లడించారు. పట్నాలో నీతీశ్‌ కుమార్‌(Nitish kumar) ఆధ్వర్యంలో నిర్వహించిన విపక్షాల భేటీకి 15 రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరైన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం చెన్నైకి చేరుకున్న స్టాలిన్‌ అక్కడి విలేకర్లతో మాట్లాడారు.  భాజపాను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలనే విషయంలో ఈ భేటీలో పాల్గొన్న అన్ని పార్టీల నేతలూ స్పష్టతతో ఉన్నారన్నారు.

భాజపాను ఓడించడమే లక్ష్యంగా పార్టీలన్నీ గట్టిగా నిలబడాలని తాను ఈ సందర్భంగా నొక్కి చెప్పినట్టు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ప్రభావం చూపే పార్టీ నాయకత్వంలో కూటమిని ఏర్పాటు చేయడంతో పాటు తాను మొత్తం ఏడు సూచనల్ని ఈ సమావేశం ముందు ఉంచాననీ.. అది సాధ్యపడకపోతే సీట్ల పంపకం గురించి ఆలోచించవచ్చని చెప్పినట్టు స్టాలిన్‌ తెలిపారు. ఎన్నికల అనంతరం పొత్తు ప్రసక్తి ఉండరాదని.. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని అంగీకరించాలన్నారు. అలాగే అవసరమైన చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రతిపాదించాలని సూచించినట్టు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని