Pawan Kalyan: కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన

తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్‌, 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించిన విషయం తెలిసిందే. 

Updated : 19 Mar 2024 19:38 IST

మంగళగిరి: తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్‌, 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్‌ సమావేశమయ్యారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ పోటీ చేస్తారని ప్రకటించారు. ఉదయ్‌ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. నన్ను ఎంపీగా పోటీ చేయమని ప్రధాని మోదీ, అమిత్‌ షా చెబితే ఆలోచిస్తా. అప్పుడు పిఠాపురం నుంచి ఉదయ్‌, కాకినాడ ఎంపీగా నేను పోటీ చేస్తాం అని పవన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని