Pawan kalyan: వైకాపా నేతల మాటలకు నా భార్య కూడా ఏడుస్తోంది: పవన్‌ కల్యాణ్‌

రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని.. అందుకే నిలబడినట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏలూరు నియోజకవర్గ నేతలు, వీరమహిళలతో పవన్‌ భేటీ అయ్యారు.

Updated : 11 Jul 2023 19:17 IST

ఏలూరు: రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని.. అందుకే నిలబడినట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏలూరు నియోజకవర్గ నేతలు, వీరమహిళలతో పవన్‌ భేటీ అయ్యారు. సమావేశంలో జనసేనాని మాట్లాడుతూ..‘‘ఎవరో పెట్టిన పార్టీని వైకాపా వాళ్లు తీసుకున్నారు. యువజనులు, శ్రామికులు, రైతులకు ఏమీ చేయని పార్టీ.. వైకాపా. నన్ను బెదిరించారు. డబ్బుతో మభ్యపెట్టాలని చూశారు. జగన్‌ అంటే కోపం లేదు.. ప్రభుత్వ విధానాలపైనే నాకు ద్వేషం. నాయకులు చేసిన తప్పులు ప్రజలపై ప్రభావం చూపిస్తాయి.

ఉపాధి హామీ కూలీల కంటే తక్కువగా వాలంటీర్ల వేతనాలు ఉన్నాయి. వాలంటీర్‌ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా?ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉంది. ఆ సమాచారాన్ని ఎక్కడకు తీసుకెళ్తున్నారు. అమ్మాయిల అదృశ్యంపై వైకాపా నేతలు ఎందుకు స్పందించరు?విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నాపై విమర్శలు చేస్తున్నారు. సేవ చేసేందుకు వచ్చిన వాలంటీర్లు, ప్రజలపై దాడులు చేస్తారా? వైకాపా నాయకుల మాటలకు నా భార్య కూడా ఏడుస్తోంది’’ అని పవన్‌ పేర్కొన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని