Purandeswari: తితిదే ఛైర్మన్‌ పదవి రాజకీయ పునరావాసానికి కావొద్దు: పురందేశ్వరి

తితిదే ఛైర్మన్‌ అన్నది రాజకీయ పునరావాస పదవి కాకూడదని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Updated : 08 Aug 2023 14:18 IST

అమరావతి: తితిదే ఛైర్మన్‌ అన్నది రాజకీయ పునరావాస పదవి కాకూడదని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే ఆ పదవికి న్యాయం చేయగలరని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. 

‘‘ఇంతకుముందు వైకాపా ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేపట్టింది. దానిపై గళం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపివేశారు. ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాసంగానే పరిగణిస్తోందని అర్థమవుతోంది. తితిదే ఛైర్మన్‌ పదవికి హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారిని.. ఆ ధర్మాన్ని అనుసరించేవారినే నియమించాలి’’ అని పురందేశ్వరి ట్వీట్‌ చేశారు.

ఇటీవల తితిదే నూతన ఛైర్మన్‌గా వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో పురందేశ్వరి ట్వీట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని