BJP: తెదేపా- జనసేన పొత్తుపై స్పందించిన పురంధేశ్వరి

తెదేపా- జనసేన పొత్తుపై ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

Updated : 23 Sep 2023 15:28 IST

విశాఖపట్నం: రాష్ట్రంలో పొత్తులపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై పవన్‌ కల్యాణ్‌ తమ అధిష్ఠానానికి వివరిస్తారని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం తమ అభిప్రాయాలు కూడా తీసుకుంటుందని స్పష్టం చేశారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉంటుందన్నారు. విశాఖలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదిక కూల్చివేత నుంచే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందన్నారు. ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం.. కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం బాధాకరమన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని