BJP: జితేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి ఏ లబ్ధికి కాంగ్రెస్‌లోకి వెళ్లారు?: రఘునందన్‌రావు

భాజపా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, భారాస ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయని భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. 

Updated : 18 Mar 2024 19:34 IST

హైదరాబాద్‌: మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి (భాజపా), రంజిత్ రెడ్డి (భారాస) పార్టీ మారడం వెనుక రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, మెదక్‌ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. వారిద్దరూ ఆ డబ్బులతో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేయబోతున్నారని చెప్పారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో ఎన్నికల వేళ నేతలు తమ అవసరాలకు అనుకూలంగా పార్టీలు మారుతున్నారు. భాజపాలో చేరిన సమయంలో పార్టీ గురించి అద్భుతంగా మాట్లాడి.. వీడాక ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. జితేందర్ రెడ్డి కుమారుడికి భాజపా టికెట్ ఇస్తే సిద్ధాంతాలు ఉన్న పార్టీ, టికెట్ రాకపోతే సిద్ధాంతాలు లేని పార్టీనా? జితేందర్, రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం వెనుక ఉన్న రహస్యాలు మాకు తెలుసు. ఏ లబ్ధి కోసం వాళ్లు కాంగ్రెస్‌లోకి వెళ్లారో చెప్పాలి? షేక్‌పేటలో జరుగుతోన్న భూ బాగోతాలపై ఈడీకి, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం ’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని