Raghunandan Rao: ఫోన్‌ ట్యాపింగ్‌పై నేను చెప్పిందే నిజమైంది: రఘునందన్‌రావు

తెలంగాణలో రాజకీయ నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీకి భాజపా నేత రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు.

Updated : 27 Mar 2024 19:22 IST

హైదరాబాద్‌: రాజకీయ నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు భాజపా నేత రఘునందన్‌ రావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు. ‘‘దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేశారు. ఇదే మాట నేను ఉప ఎన్నిక సమయంలో చెప్పాను. 2020 నవంబర్‌లో నేను చెప్పిందే.. ఇప్పుడు నిజమైంది.

గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రమేయం లేకుండా పోలీసులు ఫోన్ ట్యాప్ చేయలేరు. ఈ కేసులో తొలి ముద్దాయిగా కేసీఆర్, రెండో ముద్దాయిగా హరీష్ రావు, మూడో ముద్దాయిగా అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలి. కల్వకుంట్ల కుటుంబానికి ఇందులో ముఖ్య పాత్ర ఉంది. ఒక్కో కేసుకు ఒక్కో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డీజీపీని కోరాను. పారదర్శకంగా విచారణ చేస్తారనే నమ్మకం నాకు ఉంది’’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని