Rahul Gandhi: రాహుల్‌ గాంధీ మరోసారి అమేఠీ నుంచి పోటీ చేస్తారా..?

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఆ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోటీ చేసే స్థానంపై వార్తలు వస్తున్నాయి. 

Published : 18 Aug 2023 17:41 IST

లఖ్‌నవూ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) 2024లో మరోసారి అమేఠీ(Amethi) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా..? దీనికి అవుననే సమాధానం వస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా కొత్తగా నియమితులైన అజయ్ రాయ్‌ దీనిపై స్పందిస్తూ.. రాహుల్ అమేఠీ నుంచే పోటీ చేస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కావాలనుకుంటే.. వారణాసి నుంచి పోటీ చేయొచ్చంటూ వ్యాఖ్యానించారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఎఫెక్ట్‌.. కోటాలో కొత్త రకం ఫ్యాన్లు..!

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేఠీ(యూపీ), వయనాడ్(కేరళ) నుంచి పోటీ చేశారు. కేరళలో విజయం సాధించిన ఆయన.. అమేఠీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. 55వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. యూపీ కాంగ్రెస్ చీఫ్ చెప్పిన మాటలు నిజమై, స్మృతినే మరోసారి బరిలో ఉంటే.. అక్కడి గట్టి పోటీ నెలకొని ఉంటుందని తెలుస్తోంది.

‘మోదీ ఇంటి పేరు’ (Modi surname case) కేసులో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి పడిన రెండేళ్ల శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం (Suprme Court) ప్రస్తుతానికి స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో వెలువరించే తీర్పును బట్టి ఆయన ఎన్నికల బరిలో ఉంటారో..? లేదో..? అనే విషయం ఆధారపడి ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని