విజయసాయి వ్యాఖ్యలపై వెంకయ్య మనస్తాపం

రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి, ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం చెందారు. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌

Published : 08 Feb 2021 19:02 IST

దిల్లీ: రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం చెందారు. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ చేసిన ఆరోపణలపై విజయసాయిరెడ్డి సభలో పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరగా.. లిఖిత పూర్వకంగా వివరాలు ఇస్తే పరిశీలిస్తానని వెంకయ్య చెప్పారు. ఆ జవాబుతో సంతృప్తి చెందకుండా ఆయన నిష్పాక్షికతను ప్రశ్నిస్తూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్‌ స్పందిస్తూ విజయసాయి వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని చెప్పారు.

ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్ కలగజేసుకుని విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనతో పలువురు సభ్యులు గళం కలిపారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ తన నిష్పాక్షికతను ప్రశ్నించడం బాధించిందని.. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.  తాను పనిచేయకుండా ఉండేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని విమర్శలు చేసినా తన విధులు తాను నిర్వర్తిస్తానన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ముందే భాజపాకు రాజీనామా చేశానని.. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని గుర్తు చేశారు.  తన హృదయం దేశ ప్రజలతో మమేకమై ఉందని.. ఎవరేమన్నా పట్టించుకోనని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

దిల్లీ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌

పంచాయతీ ఎన్నికల్లో ‘నోటా’: ద్వివేది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని