Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 23 Sep 2023 19:33 IST

దిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ సంపత్‌, వ్యాపారవేత్త శ్రీనివాస్‌రెడ్డి దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రేవంత్‌, మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌  మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. కొందరు ముఖ్యనాయకులు త్వరలోనే పార్టీలో చేరి కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారని వివరించారు.

‘‘సోనియాగాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సభకోసం గ్రౌండ్‌ ఇవ్వకపోయినా, హోటళ్లను ఇవ్వనీయకపోయినా విజయభేరి సభ ఎంత విజయవంతమైందో అందరూ చూశారు. భారాస ఇచ్చిన టికెట్లలో 86 మంది పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛ, గౌరవం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటే అన్నివర్గాల వారు స్వేచ్ఛగా జీవించవచ్చు. అందుకే ప్రజలు స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ప్రజలకు తక్షణ అవసరంగా ఉంది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని