Revanthreddy: ఏక్‌నాథ్‌ శిందేలను తయారు చేసింది కేసీఆర్‌ కాదా?: రేవంత్‌రెడ్డి

అకాల వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా యుద్ధ ప్రాతిపదికన

Published : 12 Jul 2022 02:20 IST

హైదరాబాద్: అకాల వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. కానీ, ఈ విషయాన్ని గాలికొదిలేసి.. సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు దుర్యోధనుడు పూనినట్టు వ్యవహరించారని ఎద్దేవా చేశారు. 

‘‘కేసీఆర్‌ మాటల్లో కొత్తేమీ లేదు.. వింతేమీ లేదు. పై ఆదేశాల ప్రకారమే అలా మాట్లాడారు. కేసీఆర్‌ తన గురించి గొప్పలు చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చేస్తున్న దానికి, చెబుతున్న దానికి ఏమైనా సంబధం ఉందా? కేసీఆర్‌ చెప్పింది నిజమే.. మోదీ వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు ఉంది. కానీ, మోదీకి గురువు కేసీఆర్‌. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్‌ లాక్కున్నప్పుడు ఇవన్నీ మర్చిపోయారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏక్‌నాథ్‌ శిందేల ఉత్పత్తి ప్రారంభించింది కేసీఆర్‌ కాదా? ప్రతిపక్ష పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్‌ను తెరాసలో చేర్చుకుని మంత్రిని చేసింది కేసీఆర్‌ కాదా? ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి రూపంలో ఏక్‌నాథ్‌ శిందేలను తయారు చేసింది కేసీఆర్‌ కాదా? ఇప్పుడు ఏక్‌నాథ్‌ శిందే బూతం కేసీఆర్‌ను పట్టుకుంది’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని