Politics: విపక్ష నేతలతో సోనియా భేటీ నేడే.. మోదీ సర్కార్‌పై పోరుకు ఉమ్మడి వ్యూహమే లక్ష్యం!

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకంచేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా ......

Published : 20 Aug 2021 01:44 IST

దిల్లీ: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విపక్షాల నేతలతో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు పలువురు సీఎంలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్న ఈ భేటీలో ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించే అవకాశం ఉంది. 

ఇప్పటికే సోనియా గాంధీ కార్యాలయం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ సహా పలువురికి  ఆహ్వానాలు పంపగా.. వారంతా అంగీకరించినట్టు సమాచారం. రాజీవ్‌ గాంధీ జయంతి రోజున (ఆగస్టు 20) జరగనున్న ఈ భేటీలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు వచ్చే ఏడాదిలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో భాజపాను ఓడించే అంశంపై అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని