Andhra News: ఎంపీ అవినాష్‌ రెడ్డి కేసు అంతులేని కథ: గోరంట్ల

వైఎస్‌ జగన్‌ అరాచకాలకు రాష్ట్ర ప్రజలు సెలవు చెప్పాలని చూస్తున్నారని తెలుగుదేశం నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

Updated : 31 May 2023 15:14 IST

రాజమహేంద్రవరం: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అరాచకాలకు రాష్ట్ర ప్రజలు సెలవు చెప్పాలని చూస్తున్నారని తెలుగుదేశం నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మహానాడును విజయవంతం చేసిన తెదేపా కార్యకర్తలు, అభిమానులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆతిథ్యం ఇవ్వడంలో తెలుగుదేశాన్ని మించింది లేదన్నారు. తెదేపా తొలి విడత మేనిఫెస్టోని ప్రజలు ఆదరిస్తారని.. దసరాకి పూర్తి స్థాయి మేనిఫెస్టో వస్తుందని చెప్పారు.

‘‘మహానాడు బ్యానర్లు కట్టుకుంటే మధ్యలో ఎంపీ భరత్ దూరి వైకాపా ఫ్లెక్సీలు కడుతున్నారు. తిరిగి మా మీదే కేసులు పెడుతున్నారు. రాజమహేంద్రవరంలో అధికారులతో కలిసి ఎంపీ ఆటలాడుకుంటున్నారు. సవాల్‌ విసురుతున్నా.. పోలీసులు చుట్టూ లేకుండా వైకాపా నేతలు ఎవరైనా బయటకు రాగలరా?’’ అని ఆయన ప్రశ్నించారు.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపైనా ఆయన స్పందిస్తూ.. సీఎం జగన్‌ దిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసు విషయం బ్రేకులు పడుతూనే ఉందన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తారా? అని ఆయన నిలదీశారు. అవినాష్ రెడ్డి కేసు అంతులేని కథ అని గోరంట్ల వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని