
TTDలో ప్రభుత్వ జోక్యం అనవసరం: కేశవ్
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానాన్ని(తితిదే) ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) పరిధిలోకి తేవాలన్న గత పాలకమండలి తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. స్వామి కనుసన్నల్లో వేల ఏళ్లుగా తితిదే పాలన సవ్యంగా జరుగుతోందన్నారు. అలాంటి సంస్థలో ప్రభుత్వ జోక్యం అనవసరమని స్పష్టం చేశారు. తితిదే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలన్నది హిందువుల ఆకాంక్ష అని ఆయన వివరించారు. గవర్నర్‌కు పీఏసీ కమిటీ నిర్ణయాన్ని తెలియజేస్తామని పయ్యావుల చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.